: ఆర్టీసీ కార్మికులు సంస్థ ఆదాయానికి గండిపెడితే ఉద్యోగం నుంచి తొల‌గిస్తాం: కేసీఆర్ ఆగ్ర‌హం


ఆర్టీసీ కార్మికులు సంస్థ ఆదాయానికి గండిపెడితే ఉద్యోగం నుంచి తొల‌గిస్తామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చీటికి మాటికి కార్మికుల స‌మ్మెల వ‌ల్ల న‌ష్టాలు వ‌స్తున్నాయని ఆయ‌న అన్నారు. కొత్త‌గా ఆలోచించి ఆర్టీసీని అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆయ‌న సూచించారు. రాష్ట్రంలో 95 డిపోల్లో 5 మాత్ర‌మే లాభాల్లో ఉండ‌డం సిగ్గు చేటని ఆయ‌న వ్యాఖ్యానించారు. కార్మికులు ఆర్టీసీని కాపాడేలా ప‌నిచెయ్యాలని ఆయ‌న సూచించారు. ఆర్టీసీ, ర‌వాణా శాఖకు స‌మ‌న్వ‌యక‌ర్త‌గా జేటీసీ వెంక‌టేశ్వ‌ర్లు అనే అధికారి ప‌నిచేస్తార‌ని ఆయ‌న తెలిపారు. డిమాండ్లు ఉన్న రూట్లలో బ‌స్సులు న‌డ‌పాలని సూచించారు. ప్రైవేటు సంస్థ‌లు ఆలోచించిన‌ట్లు ఆర్టీసీ ఆలోచించి ప‌నిచెయ్యాల‌ని అన్నారు.

  • Loading...

More Telugu News