: డబ్బు తీసుకుని పార్టీ మారే కర్మ నాకేంటి: ఎస్వీ మోహన్ రెడ్డి


తెలుగుదేశం పార్టీ నుంచి డబ్బులు తీసుకుని పార్టీ మారాల్సిన ఖర్మ తనకు పట్టలేదని ఇటీవల వైకాపా నుంచి ఫిరాయించిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, తమది సంపన్న కుటుంబమేనని, డబ్బు కోసం కక్కుర్తి తనకు లేదని తెలిపారు. జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింతగా బలపడుతుందన్న నమ్మకం లేకనే తెలుగుదేశం పార్టీలోకి ఎమ్మెల్యేలు చేరుతున్నారని, చంద్రబాబు విజన్ అభివృద్ధికి దోహదపడుతుందని పూర్తిగా నమ్మామని ఆయన స్పష్టం చేశారు. తమపై అనవసర ఆరోపణలు చేస్తే, తామూ ఎదురుదాడి చేయాల్సి వస్తుందని మోహన్ రెడ్డి హెచ్చరించారు. రూ. 1.4 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని వైకాపా నేతలు చేస్తున్న ప్రచారం అసత్యమని, భూముల కేటాయింపులే జరుగకుండా కుంభకోణం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News