: జమ్మలమడుగులో వైకాపాలో చేరిన ఆదినారాయణరెడ్డి అనుచరులు


నిన్నటివరకూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గంలో ఉన్న 100కు పైగా కుటుంబాలు వైకాపాలో చేరాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమక్షంలో వీరంతా వైకాపాలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇదే సమయంలో జమ్మలమడుగు మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి సంగరయ్య వైకాపాలో చేరారు. తామంతా ఇకపై వైకాపా అధినేత జగన్ కు, అవినాష్ రెడ్డికి అండగా ఉంటామని పార్టీలో చేరిన కుటుంబాలు వెల్లడించాయి. ప్రజలకు ఏ మాత్రమూ ఉపయోగం లేని చంద్రబాబు పాలనతో వీరంతా అభివృద్ధికి దూరంగా ఉన్నారని, ఎన్ని పథకాలు ఉన్నా వీరి దరికి చేరలేదని ఈ సందర్భంగా అవినాష్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఫిరాయిస్తున్నా, ప్రజల అభిమానం చెక్కు చెదరలేదని అన్నారు.

  • Loading...

More Telugu News