: రియో నుంచి 3 వేల గంటల లైవ్... 8 చానల్స్ పూర్తిగా అంకితం: స్టార్ ఇండియా
మరో 49 రోజుల్లో ప్రారంభం కానున్న విశ్వ క్రీడా సంబరాలు 'రియో ఒలింపిక్స్'ను భారత అభిమానులకు అందించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామని స్టార్ ఇండియా ప్రకటించింది. ఆగస్టు 5 నుంచి పోటీలు ప్రారంభం కానుండగా, మొత్తం 3 వేల గంటలకు పైగా లైవ్ ప్రసారాలు ఉంటాయని, వీటిని 8 స్టార్ చానళ్ల ద్వారా వివిధ భాషల్లో అందిస్తామని స్టార్ స్పోర్ట్స్ సీఈఓ నితిన్ కుక్రేజా వెల్లడించారు. 24 గంటల పాటూ ఈ ప్రసారాలు ఉంటాయని, తొలిసారిగా ఆరంభ వేడుకలను రెండు భాషల్లో ప్రసారం చేస్తామని తెలిపారు. తమ యాప్ హాట్ స్టార్ లో ఉచితంగా ఒలింపిక్స్ పోటీలను చూడవచ్చని అన్నారు. లైవ్ కామెంట్రీ, ఇండియాలోని క్రీడా పండితులతో కూడిన విశ్లేషణలు ఉంటాయని ఆయన వివరించారు.