: సింహాలతో సెల్ఫీ దిగి చిక్కుల్లో పడ్డ క్రికెటర్ జడేజా
విశ్రాంతి పేరిట జింబాబ్వే పర్యటనకు వెళ్లని జడేజా, భారత అటవీ శాఖ నిబంధనలను ఉల్లంఘించి, సింహాలతో సెల్ఫీలు దిగి చిక్కుల్లో పడ్డాడు. తన భార్యతో కలిసి గిర్ అభయారణ్యంలోకి పర్యటనకు వెళ్లిన జడేజా దంపతులు దాదాపు పదికి పైగా సింహాలు సేదదీరుతుంటే, వాటి ముందు కూర్చుని ఫోటోలు దిగి వాటిని సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. అటవీ నిబంధనల ప్రకారం, గిర్ అడవుల్లో సఫారీ చేసే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు దిగరాదు. జడేజా దంపతులు నిబంధనలను మీరినట్టు ఈ చిత్రాలు స్పష్టం చేస్తుండగా, గుజరాత్ అటవీ శాఖ విచారణకు ఆదేశించింది. కాగా, ఈ ఘటన జరిగిన సమయంలో అటవీ అధికారులు జడేజా దంపతుల దగ్గరే ఉన్నట్టు తెలుస్తుండటంతో, వారిపైనా చర్యలు తప్పవని తెలుస్తోంది.