: ఇప్పటివరకూ ట్రయల్ మాత్రమే, అసలు సినిమా ముందుంది: ఏపీపై పారికర్ కీలక వ్యాఖ్యలు


ప్రధాని నరేంద్ర మోదీ రెండు సంవత్సరాల పాలన కేవలం ట్రయల్ మాత్రమేనని, వచ్చే మూడేళ్లలో అసలు సినిమా కనిపిస్తుందని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి పథంలో దేశం ఎన్నడూ లేనంతగా ముందుకు దూసుకుపోనుందని ఆయన వివరించారు. నెల్లూరులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినప్పటికీ, అభివృద్ధి కోసం ఎంతో చేస్తోందని తెలిపారు. విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని హామీలనూ నెరవేరుస్తామని తెలియజేశారు. ఇప్పటివరకూ 1.15 కోట్ల మంది వంట గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారని వెల్లడించిన ఆయన, 5 కోట్ల మందికి గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇచ్చి చూపిస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News