: సుబ్రహ్మణ్యస్వామికి ఎంట్రీ!... స్మృతి ఇరానీకి డిమోషన్: కేంద్ర కేబినెట్ పై ఊహాగానాలు


కేంద్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 22న జరగనుందని భావిస్తున్న విస్తరణలో బీజేపీ ఫైర్ బ్రాండ్ స్మృతి ఇరానీకి ప్రధాని నరేంద్ర మోదీ భారీ షాకివ్వనున్నట్లు సమాచారం. కేంద్ర మానవవనరుల శాఖ నుంచి ఆమెను సమాచార, ప్రసార శాఖ మంత్రిగా డిమోట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే రాజ్యసభలో అడుగు పెట్టిన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామికి కేంద్ర మానవ వనరుల శాఖ బాధ్యతలను కట్టబెట్టనున్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే, ఇటీవలే రాజ్యసభకు వరుసగా నాలుగో సారి ఎన్నికైన పార్టీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల బాధ్యతలను పర్యవేక్షిస్తున్న వెంకయ్యనాయుడుకు కూడా ఈ విస్తరణలో ప్రమోషన్ లభించనుందని తెలుస్తోంది. పట్టణాభివృద్ధి శాఖను వెంకయ్య నుంచి తప్పించనున్న మోదీ, ఆయనకు గ్రామీణాభివృద్ధి లేదా వ్యవసాయ శాఖను కట్టబెట్టే అవకాశాలున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News