: ఎయిర్ హోస్టెస్ తో కేంద్ర మంత్రి ప్రేమాయణం!... త్వరలోనే పెళ్లికొడుకు కానున్న బాబుల్ సుప్రియో!


బాలీవుడ్ లో గాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో రాజకీయ తెరంగేట్రం చేసి ఎంపీగా విజయం సాధించిన బాబుల్ సుప్రియో గుర్తున్నారుగా. సినిమా రంగం నుంచి వచ్చిన బాబుల్ కు నరేంద్ర మోదీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. తన కేబినెట్ లో పట్టణాభివృద్ధి, హౌసింగ్ శాఖ మంత్రిగా బాబుల్ ను చేర్చుకున్న మోదీ... రాజకీయ నాయకుడిగా వచ్చిన ప్లేబ్యాక్ సింగర్ కు అధిక ప్రాధాన్యమే ఇచ్చారు. పాలనలోనూ సత్తా చాటుతున్న బాబుల్... ఆగస్టు 9న పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ప్రస్తుతం ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్న రచనా శర్మతో నిండా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన బాబుల్... ఇటీవలే ఆమెతో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. ఆగస్టులో ఈ జంట దంపతులుగా మారనున్నారు. అయినా సింగర్ గా, పొలిటీషియన్ గా ఉన్న బాబుల్ కు ఎయిర్ హోస్టెస్ తో ప్రేమ ఏమిటనేగా మీ డౌటు. సింగర్ గా ఉన్న సమయంలో అప్పటికింకా రాజకీయ రంగప్రవేశంపై తర్జనభర్జన పడుతున్న సమయంలోనే రచనా శర్మ... తాను సేవలందిస్తున్న విమానంలో ఉన్న బాబుల్ ను పలకరించిందట. యోగా గురువు బాబా రాందేవ్ తో తన రాజకీయంపై చర్చిస్తున్న బాబుల్ ను పలకరించిన శర్మ... సీటు దక్కితే మాత్రం విజయం మీదేనంటూ భుజం తట్టారట. దీంతో ఆమెపై ఆసక్తి చూపిన బాబుల్, శర్మ ఫోన్ నెంబరు తీసుకున్నారు. ఇక ఆ తర్వాత ఇద్దరూ తరచూ ఫోన్లు చేసుకోవడం... శర్మ చెప్పినట్లే బాబుల్ కు టికెట్ రావడం, ఎంపీగా విజయం సాధించడం, కేంద్ర మంత్రిగా పదవి దక్కడం జరిగిపోయాయి. ఈ క్రమంలో వీరి మధ్య అనుబంధం మరింత బలపడింది. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట ఇటీవలే పెద్దల సమక్షంలో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుందట. ఇక ఆగస్టు 9న వీరిద్దరూ ఓ ఇంటివారు కానున్నారు. శర్మకు ఈ వివాహం తొలిదే అయినా, బాబుల్ కు మాత్రం ఈ పెళ్లి రెండోదట.

  • Loading...

More Telugu News