: ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ కు న్యాయస్థానం వార్నింగ్!
ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ కు న్యాయస్థానం హెచ్చరికలు జారీ చేసింది. గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సిన ప్రాంతంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో తన కారును డ్రైవ్ చేసిన బెన్ స్టోక్స్ లండన్ పోలీసులకు దొరికిపోయాడు. మితిమీరిన వేగంతో వెళ్తున్నాడంటూ పోలీసులు వివిధ చార్జిషీట్లు న్యాయస్థానంలో దాఖలు చేశారు. గతంలో నాలుగు సార్లు ఇలా పట్టుబడ్డాడని ఛార్జిషీట్ లో న్యాయస్థానానికి పోలీసులు తెలిపారు. దీంతో అతని ట్రాక్ ను పరిశీలించిన న్యాయస్థానం అతని ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో ఆరు నెలల వరకు ఏ విధమైన వాహనాన్ని డ్రైవ్ చేయరాదని ఆదేశించింది. కోర్టు ఆదేశాన్ని ధిక్కరిస్తే జైలు శిక్ష ఖాయమని స్పష్టం చేసింది. కాగా, టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో వెస్టిండీస్ ఆటగాడు కార్లోస్ బ్రాత్ వైట్ దూకుడుకు బలైన బెన్ స్టోక్స్ పై అభిమానులు ప్రేమను కురిపించారు. మరి, ఇలాంటి ప్రవర్తనపై అభిమానులు ఏమంటారో చూడాలి!