: హైకోర్టు ఆదేశాలు పాటించి ఉంటే 'మధుర' దుర్ఘటన జరిగి ఉండేది కాదు: యూపీ గవర్నర్ రాం నాయక్


ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు పాటించి ఉంటే మధుర అల్లర్లు చోటుచేసుకుని ఉండేవి కాదని ఉత్తరప్రదేశ్ గవర్నర్ రాంనాయక్ అభిప్రాయపడ్డారు. కాన్పూర్ లో ఆయన మాట్లాడుతూ, మధుర వంటి ఘటనలు గతంలో చోటుచేసుకోలేదని అన్నారు. జవహర్ భాగ్ దురాక్రమణలు తొలగించాలని హైకోర్టు తీర్పు వెల్లడించగానే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఉంటే, అల్లర్లు జరిగి ఉండేవి కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ పలు ప్రాంతాల్లో భూములు దురాక్రమణలో ఉన్నాయని, వాటిని తొలగించాలంటూ స్థానికి న్యాయస్థానాలు తీర్పులు ఇస్తూనే ఉన్నాయని, అయితే వాటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News