: అత్యాశతోనే బాబా మాయలో పడ్డ 'లైఫ్ స్టయిల్' యజమాని!


లైఫ్ స్టయిల్ బిల్డింగ్ యజమాని మధుసూదన్ రెడ్డి కేసులో పలు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. మధుసూదన్ రెడ్డి బురిడీ బాబా (శివానందబాబా) మాయలో పడేందుకు పెద్ద తతంగమే నడిచింది. రైస్ పుల్లింగ్ గ్యాంగ్ మధుసూదన్ రెడ్డిని మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు. వాస్తవానికి గతంలో పూజలు చేసి, మధుసూదన్ రెడ్డి ఇచ్చిన లక్షన్నర రూపాయలను తన మహిమతో మూడు లక్షల రూపాయలు చేసినట్టుగా మోసం చేసి చూపించిన శివానందబాబా ఆయనకు బాగా నమ్మకం కలిగించాడు. దీంతో స్నేహితులు, తెలిసిన వారి దగ్గర్నుంచి కోటి 30 లక్షల రూపాయలను మధుసూదన్ రెడ్డి తెచ్చి శివానందబాబాకు ఇచ్చాడు. ఈ మొత్తాన్ని పూజలు చేసి రెండు కోట్ల 60 లక్షలు చేస్తానని చెప్పిన శివానందబాబా...అందరికీ షాకిస్తూ భారీ మొత్తంతో ఉడాయించాడు. దీంతో వారు లబోదిబోమంటున్నారు. దీనిపై అంతా షాక్ కు గురయ్యారు. అంత డబ్బు ఉన్న లైఫ్ స్టైల్ బిల్డింగ్ యజమాని ఇంకా డబ్బు కోసం దురాశ పడడమా? అని ముక్కున వేలేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News