: చంద్రబాబూ! ఏపీ ప్రజల ఓపికను పరీక్షిస్తున్నావు...జాగ్రత్త!: సి.రామచంద్రయ్య


'చంద్రబాబునాయుడూ! ఏపీ ప్రజల ఓపికను పరీక్షిస్తున్నావు...ఇది సరికాదు, బొక్కబోర్లా పడతావు జాగ్రత్త' అంటూ కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య హెచ్చరించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి రాష్ట్రంలో అది చేశాం, ఇది చేశామని చెబుతున్నావు? అసలు నువ్వేం చేశావు? అంటూ నిలదీశారు. వివిధ విభాగాల్లో డబ్బులను అడ్డంగా ఖర్చు చేస్తూ, బీద అరుపులు అరుస్తున్నావని ఆయన ఎద్దేవా చేశారు. ఖరీదైన బస్సులు, గెస్టు హౌస్ ఆధునికీకరణ, ఫ్లైట్ లలో తిరుగుళ్లు, పెద్ద పెద్ద సెట్లువేసి వేడుకలు ఎలా నిర్వహించావని ఆయన అడిగారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. ఒక ముఖ్యమంత్రి ఫైవ్ స్టార్ హోటల్ లో ఉంటూ రాష్ట్రాన్ని పరిపాలించాడని చరిత్రలో ఎవరైనా విన్నారా? అని ఆయన ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News