: 'ఉడ్తా పంజాబ్' లీక్ పై స్పందించిన అమీర్ ఖాన్


ఉడ్తా పంజాబ్ చిత్రం సెన్సార్ కోసం ఇచ్చిన ప్రింటే ఆన్ లైన్లో లీకైందని, ఆ ప్రింటుపై 'ఫర్ సెన్సార్' అన్న స్టాంపు ఉందని నిర్మాతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ స్పందించాడు. ప్రతి ఒక్కరూ వాక్ స్వాతంత్ర్యానికి మద్దతివ్వాలని చెప్పిన అమీర్, సినిమాను కేవలం థియేటర్లలో మాత్రమే చూడాలని, పైరేట్లు, పైరసీ దారులను విజయం చెందనివ్వద్దని కోరాడు. కాగా, చిత్రాన్ని అడ్డుకునే ఆఖరి ప్రయత్నంగా, కొందరు సుప్రీంకోర్టు గడప తొక్కినప్పటికీ, ఫలించలేదన్న సంగతి తెలిసిందే. ఇక అన్ని అడ్డంకులూ తొలగిన నేపథ్యంలో ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News