: నకిలీ బాబా మరో ముగ్గురితో మాట్లాడాడు: పోలీసులతో డ‌్రైవర్
పూజల పేరుతో హైదరాబాద్‌లో 'లైఫ్ స్టయిల్' బిల్డింగ్ అధినేత మధుసూదన్ రెడ్డి ఇంట్లో 1.30 కోట్లు అపహరించిన నకిలీ బాబా శివ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అదుపులోకి తీసుకున్న కర్ణాటకకు చెందిన డ్రైవర్ షాజహాన్‌ను పోలీసులు ప్రశ్నించారు. దొంగ బాబాతో మరో ముగ్గురు మాట్లాడినట్లు షాజహాన్ పోలీసులకి తెలిపాడు. బాబా పరారీపై దర్యాప్తు చేస్తోన్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఓరిస్ హోటల్ వద్ద డబ్బు మూటను తన కారులోకి దొంగబాబా మార్చుకున్నట్లు పోలీసులకి తెలిసింది. బాబా కర్ణాటక వైపుగా పారిపోయినట్లు అనుమానిస్తోన్న పోలీసులు బెంగళూరుకి ప్రత్యేక గాలింపు బృందాలను పంపించారు.