: అలెన్ బోర్డర్ సరసన మహేంద్రుడు!... అత్యధిక విజయాలు సాధించిన రెండో కెప్టెన్ గా ధోనీ రికార్డు!


కొత్త కుర్రాళ్లతో కూడిన జట్టుతో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి విపత్కర పరిస్థితులు తప్పవన్న విశ్లేషణలకు చెక్ పడిపోయింది. మూడు వన్డేల సిరీస్ ను రెండో వన్డేకే చేజిక్కించుకున్న ధోనీ... నిన్న జరిగిన మూడో వన్డేలోనూ విజయం సాధించి ప్రపంచ క్రికెట్ లో అరుదైన రికార్డును సాధించాడు. నిన్నటి విజయంతో 107 విజయాలు సాధించిన ధోనీ... ప్రపంచంలోనే అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ గా ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డన్ సరసన చేరాడు. ఇక ఈ విషయంలో 165 విజయాలతో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News