: ‘సమన్వయం’ కుదర్లేదు!... డిగ్గీరాజా ముందే జానా, సర్వేల మాటల యుద్ధం!


ముఖ్య నేతలంతా హ్యాండిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో పార్టీని కాపాడుకోవడంతో పాటు కేడర్ లో ఆత్మవిశ్వాసం నింపే విషయంపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. ఈ క్రమంలో నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాదులో ల్యాండైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్, ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజు పార్టీ నేతలతో దాదాపు 4 గంటల పాటు భేటీ అయ్యారు.‘కో-ఆర్డినేషన్ కమిటీ’ పేరిట జరిగిన ఈ సమావేశంలో ఏ సందర్భంలోనూ సమన్వయం కనిపించిన దాఖలా లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ కేడర్ లో మనోస్థైర్యం నింపాలంటే నేతల మధ్య విభేదాలు సమసిపోవాల్సిందేనన్న దిశగా సాగిన ఈ సమావేశంలో డిగ్గీరాజా ముందే... పార్టీ సీనియర్లు జానారెడ్డి, సర్వే సత్యనారాయణ వాదులాడుకున్నారట. తనపై వ్యతిరేక వ్యాఖ్యలు ఎందుకు చేశావన్న జానా ప్రశ్నకు ఘాటుగా స్పందించిన సర్వే.. ఘాటుగానే బదులిచ్చారట. కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన రూ.5లకే భోజనం చేసి, బాగుందని దానిపై ప్రశంసలు కురిపిస్తే ప్రజల్లోకి ఏ సందేశం వెళుతుందని సర్వే ప్రశ్నించారు. దీంతో వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న డిగ్గీరాజా వారిద్దరికీ సర్ది చెప్పారట.

  • Loading...

More Telugu News