: రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు.. హైదరాబాద్‌లో 24గంటల్లో ఆరు చోట్ల చైన్ స్నాచింగ్‌లు
హైదరాబాద్‌లో చైన్ సాచర్లు రెచ్చిపోతున్నారు. నగలు వేసుకొని బయటికి రావాలంటే మహిళలు వణికిపోతున్నారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్‌లో 24గంటల్లో ఆరు చోట్ల చైన్ స్నాచింగ్‌లు జరిగాయి. కర్మాన్ ఘాట్, బోయిగూడ, తుకారం గేట్, గోపాలపురంలో ఒంటరిగా వెళుతోన్న మహిళల మెడలోంచి చైన్లను లాక్కెళ్లారు. సికింద్రాబాద్ పరిధిలో షాపులో ఉన్న మహిళ నుంచి కూడా దుండగులు గొలుసు లాక్కెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు స్నాచర్ల ఊహా చిత్రాలను విడుదల చేశారు. చైన్ స్నాచర్ల కోసం ప్రత్యేక గాలింపు బృందాలు రంగంలోకి దిగాయి.