: రెండు నెలల వ్యవధిలో రూ. 9 పెరిగిన పెట్రోలు ధర


పెట్రోలు ధరలు మరోసారి పెరిగాయి. తాజా సవరింపులో పెట్రోలుపై నామమాత్రంగా 5 పైసలు వడ్డించిన చమురు కంపెనీలు, డీజెల్ పై రూ. 1.26 పైసలు పెంచాయి. ఈ ధరలు తక్షణం అమల్లోకి వచ్చాయి. ప్రతి నెలా 1, 16వ తేదీల్లో ధరలను సవరిస్తూ వస్తున్న ఓఎంసీలు తాజాగా మరోసారి ధరలను పెంచాయి. గడచిన ఆరు వారాల వ్యవధిలో ధరలు నాలుగు సార్లు పెరిగాయి. ఏప్రిల్ 16 నుంచి... అంటే సరిగ్గా రెండు నెలల కాలంలో పెట్రోలు ధర రూ. 9.04, డీజెల్ ధర రూ. 11 వరకూ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతున్నప్పటికీ, ఇండియాలో మోదీ సర్కారు కావాలనే పెట్రోలు ధరలను పెంచుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వాస్తవ గణాంకాల ప్రకారం రూ. 38కే లీటరు పెట్రోలును ప్రస్తుతం అందించే పరిస్థితులు ఉన్నాయని, కేంద్రం సుంకాలను పెంచినంత వేగంగా, వాటిని తగ్గించేందుకు యత్నించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

  • Loading...

More Telugu News