: నా కూతురు నన్ను గుర్తుపడుతుందో లేదో: ధోనీ అనుమానం
జింబాబ్వే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ధోనీ సంతోషంతో ఉప్పొంగిపోతాడని భావించిన అభిమానులకు ధోనీ సమాధానం ఆశ్చర్యానికి గురి చేసింది. సిరీస్ క్లీన్ స్వీప్ అయిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధోనీ మాట్లాడుతూ, తన కుమార్తె జీవా తనను గుర్తుపడుతుందో లేదోనని ఆందోళన వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా టూర్, ఆ తర్వాత ఆసియా కప్ టీ20, దాని తరువాత శ్రీలంకతో టీ20 సీరీస్, అది అయిపోయాక వరల్డ్ టీ20, అది ముగియగానే ఐపీఎల్, ఇది ముగిసిన వెంటనే జింబాబ్వే టూర్... ఇలా గత ఆరు నెలలుగా ఇంటికి దూరంగా గడపాల్సి వస్తోందని, సుదీర్ఘ కాలంగా దూరంగా ఉంటున్నందుకు జీవా తనను గుర్తుపడుతుందో లేదోనని ఆందోళన వ్యక్తం చేశాడు. టీ20 మ్యాచ్ ల తరువాత ధోనీ కుమార్తెను చేరుకోనున్నాడు. విండీస్ సిరీస్ లో విశ్రాంతి తీసుకోనుండడంతో మళ్లీ న్యూజిలాండ్ సిరీస్ వరకు ధోనీ జట్టుతో కలవాల్సిన అవసరం లేదు. దీంతో సుమారు 3 నెలల పాటు కుమార్తెతో ధోనీ సరదగా గడిపే అవకాశం ఉంది.