: నెల్లూరులో రేపు మనోహర్ పారికర్
రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఏపీలో పర్యటించనున్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వికాస్ పర్వ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో రేపు నిర్వహించనున్న వికాశ్ పర్వ్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. దీంతో రేపు హైదరాబాదు వచ్చి, రోడ్డు మార్గంలో నెల్లూరు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. నెల్లూరు పర్యటన అనంతరం పట్టణంలోని మేధావి వర్గంతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఆయన వారికి వివరిస్తారు.