: 30 మంది యువతులను మోసం చేసిన ముంబై, పూణే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్టు
ముంబై, పూణే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పోలీసులు పట్టుకున్నారు. మ్యాట్రిమోనీ సైట్లు లక్ష్యంగా మహిళలను మోసం చేసే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ, ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారినని నమ్మిస్తూ రాహుల్ సిన్హా అనే వ్యక్తి సుమారు 30 మంది యువతులను మోసం చేశాడు. వీరి నుంచి సుమారు 2 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇంత వరకు రాహుల్ సిన్హా చేతిలో మోసపోయిన మహిళలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, డాక్టర్లని వారు తెలిపారు. విద్యావంతులైన యువతులు మోసపోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.