: ప్రణబ్ ముఖర్జీకి ఐవరీ కోస్ట్ అత్యున్నత పురస్కారం
ఐవరీ కోస్ట్ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆ దేశ అత్యున్నత పురస్కారం అందుకున్నారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఐవరీ కోస్ట్ అధ్యక్షుడు అల్సానే ఔట్టారా, భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే ప్రణబ్ ముఖర్జీకీ అల్సానే ఔట్టారా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందించారు. తనకు ఐవరీ కోస్ట్ అత్యున్నత పురస్కారం దక్కడం పట్ల ప్రణబ్ ముఖర్జీ హర్షం వ్యక్తం చేశారు. ఆ దేశంతో భారత్ ఎన్నో ఏళ్లుగా సత్సంబంధాలు కొనసాగిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతికి ఆ దేశ అత్యున్నత పురస్కారం రావడంపై ప్రెస్ సెక్రటరీ వేణు రాజమోనీ స్పందిస్తూ.. రాష్ట్రపతి ఎన్నో గౌరవ డిగ్రీలను అందుకున్నారని, అయితే ఒక దేశం నుంచి ఇటువంటి పురస్కారం రావడం మొదటిసారి అని చెప్పారు.