: ఏపీ ఉద్యోగులు వెనక్కి వెళ్లాలి.. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల ధర్నా


తెలంగాణ సచివాలయ ఉద్యోగ సంఘాలు మ‌రోసారి ధ‌ర్నాకు దిగాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ‌ సెక్ర‌టేరియ‌ట్ లో ఈరోజు ‘ఆంధ్రా ఉద్యోగులు గోబ్యాక్’ అంటూ వారు ర్యాలీ నిర్వహించి, నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగులను తెలంగాణకు కేటాయించడంపై వారు ఆందోళ‌న తెలిపారు. వారు ఆంధ్రప్ర‌దేశ్‌లోనే ప‌నిచేయాల‌ని, తెలంగాణ వారు మాత్ర‌మే ఇక్క‌డ విధులు నిర్వ‌హించాల‌ని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. స‌చివాల‌యంలో ప‌నిచేస్తోన్న తెలంగాణ ఏఎస్‌వోల‌కు ప్ర‌మోష‌న్లు ఇస్తూ ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకోవాల‌ని వారు కోరుతున్నారు. ఏపీ ఉద్యోగులు వెన‌క్కి వెళ్లిపోవాల‌ని నిన‌దిస్తున్నారు.

  • Loading...

More Telugu News