: నార్త్ కొరియా వద్ద 21 ప్లూటోనియం అణ్వాయుధాలు: అమెరికా


క్రమక్రమంగా ఉత్తర కొరియా అణ్వాయుధాల సంఖ్యను పెంచుకుంటూ వస్తోందని అమెరికా రీసెర్చ్ సంస్థ ఇనిస్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ వెల్లడించింది. 2014 చివరికి నార్త్ కొరియా వద్ద 2014 చివరకే 16 వరకూ అణ్వాయుధాలు చేరాయని, వాటి సంఖ్య ఇప్పుడు 21కి పెరిగి వుండవచ్చని అంచనా వేసింది. యురేనియంతో పాటు పెను విధ్వంసం సృష్టించగల ప్లూటోనియం అణ్వాయుధాలు ఆ దేశం వద్ద ఉన్నాయని భావిస్తున్నట్టు తెలిపింది. కిమ్ జాంగ్ అమ్ముల పొదిలో కనీసం 13 నుంచి గరిష్ఠంగా 21 వరకూ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని, వాటి సంఖ్య ఇంకాస్త ఎక్కువగా అయినా ఉండవచ్చని ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు డేవిడ్ అల్ బ్రైట్, సెరీనా కెల్హర్ లు ఓ నివేదికలో తెలిపారు. ప్లూటోనియం ఇంధనాన్ని పెద్దఎత్తున తయారు చేసే పనిలో ఉత్తర కొరియా నిమగ్నమై ఉందని యూఎస్ ప్రభుత్వం ప్రకటించిన వారం రోజుల వ్యవధిలో ఈ నివేదిక బహిర్గతం కావడం గమనార్హం. యాంగ్ బయాన్ న్యూక్లియర్ సైట్ లోని రేడియో కెమికల్ ల్యాబొరేటరీలో ప్లూటోనియం తయారీ జరుగుతోందని వారు వివరించారు.

  • Loading...

More Telugu News