: ఆసియాలోని టాప్ 50 వర్సిటీల్లో నాలుగు ఐఐటీలు, ఐఐఎస్సీకి చోటు
ప్రపంచ ప్రఖ్యాత విద్యాలయాల జాబితాలో భారతీయ విశ్వవిద్యాలయాలు సత్తా చాటుతున్నాయి. 2016కు సంబంధించిన ఆసియాలోని టాప్ 50 వర్సిటీలు ఇవేనంటూ ‘క్యూఎస్ యూనివర్సిటీ’ విడుదల చేసిన జాబితాలో బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) స్థానం దక్కించుకుంది. ఐఐఎస్సీతో పాటు ఈ జాబితాలో నాలుగు ఐఐటీలు కూడా చోటు దక్కించుకున్నాయి. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ తొలి స్థానంలో ఉన్న జాబితాలో ఐఐఎస్సీకి 33వ స్థానం దక్కింది. ఇక ఈ జాబితాలోని నాలుగు ఐఐటీల విషయానికొస్తే... ఐఐటీ- ముంబై 35వ ర్యాంకులో, ఐఐటీ- ఢిల్లీ 36వ స్థానంలో నిలిచాయి. 43వ స్థానంలో ఐఐటీ- మద్రాస్ నిలవగా, ఐఐటీ- కాన్పూర్ 48వ స్థానాన్ని దక్కించుకుంది.