: చంద్ర‌బాబు మొదటి రీల్లోనే ఎన్టీఆర్‌ను మోసం చేశారు: భూమ‌న‌


ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు మొదటి రీల్ నుంచి ఆఖరి రీల్ వరకు విలనిజం ప్రదర్శిస్తూనే ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈరోజు మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. చంద్ర‌బాబు మొదటి రీల్లోనే ఎన్టీఆర్‌ను మోసం చేశారని అన్నారు. ఎన్టీఆర్ విష‌యంలోనే బాబు విల‌నిజం బ‌య‌ట ప‌డిందని ఆయ‌న ఎద్దేవా చేశారు. ‘జ‌గ‌న్ పై వ్య‌క్తిగ‌త దాడి చేయ‌డ‌మే త‌ప్పా మీరు చెప్పుకునేందుకు ఏవైనా అభివృద్ధి ప‌నులు చేశారా..?’ అని ఆయ‌న చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ పై వ్య‌క్తిగ‌త దాడుల‌కే ప్ర‌భుత్వ నేత‌లు ప‌రిమితం అవుతున్నారని ఆయ‌న విమ‌ర్శించారు. ‘మీ త‌ప్పుల‌ను స‌వ‌రించే ప‌ని జ‌గ‌న్ చేస్తున్నార’ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News