: కలిసి ఎక్కడికో వెళ్లిన విరాట్, అనుష్క!
ఇండియాలో సెలబ్రిటీ కపుల్ గా అత్యధిక గుర్తింపున్న జంటల్లో విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మలు మొదట్లో ఉంటారంటే సందేహం లేదు. వీరిద్దరూ కలిసున్నారని కొన్ని రోజులు, విడిపోయారని కొన్ని రోజులూ ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా వీరిద్దరూ తిరిగి కలిసిపోయారని తెలుస్తుండగా, నిన్న చండీగఢ్ ఎయిర్ పోర్టుకు ఒకే కారులో వచ్చిన వీరు కలిసి ప్రయాణం చేశారు. వీరు ఎక్కడికి వెళ్లారన్నది తెలియనప్పటికీ, ఎయిర్ పోర్టు ముందు వీరున్న చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, వీరిద్దరూ కలిసే ఉన్నారని చెప్పేందుకు మరో సాక్ష్యంగా నిలిచింది. అనుష్క తాజా చిత్రం 'ఫిలౌరీ' షూటింగ్ చండీగఢ్ సమీపంలో జరుగుతుండగా, అనుష్క అక్కడే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న జింబాబ్వే టూరు నుంచి విశ్రాంతి తీసుకుంటున్న విరాట్, తన ప్రియురాలు అనుష్క కోసమే చండీగఢ్ వెళ్లాడని తెలుస్తోంది. ఎయిర్ పోర్టులోకి వెళుతున్న కోహ్లీ, అనుష్కల చిత్రాన్ని మీరూ చూడవచ్చు.