: ముద్రగడ దీక్షపై హైకోర్టులో రెండు పిటిషన్లు


కాపు రిజర్వేషన్లే లక్ష్యంగా ఉద్యమ బాట పట్టిన కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తాజాగా చేపట్టిన ఆమరణ దీక్షపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో నిన్న రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ముద్రగడ అరెస్ట్ విషయంలో ప్రభుత్వం చట్ట ప్రకారం వ్యవహరించాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలు కాగా, ముద్రగడకు మెరుగైన వైద్యం కోరుతూ రెండో పిటిషన్ దాఖలైంది. వివరాల్లోకెళితే... సీఆర్పీసీ సెక్షన్ 41 ప్రకారం ముందస్తు నోటీసులు ఇచ్చిన తర్వాతే ముద్రగడను అరెస్ట్ చేయాలని అఖిల భారత కాపు జాగృతి చైర్మన్ చందూ జనార్దన చంద్రశేఖర్ తొలి వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఏపీ హోం శాఖ కార్యదర్శి, డీజీపీ, ఉభయ గోదావరి జిల్లాల ఎస్పీలు, కిర్లంపూడి పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్లను ఆయన తన పిటిషన్ లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. మరింత మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని నిమ్స్ లేదా మరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ముద్రగడను తరలించాలని మరో వ్యక్తి రెండో పిటిషన్ ను దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News