: ఓర్లాండో ఘటనలో కొత్త ట్విస్ట్... మతీన్ భార్యకు ప్రమేయం!


ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓర్లాండో కాల్పుల ఘటన వెనుక ఒమర్ మతీన్ భార్య నూర్ మతీన్ కు సంబంధం ఉండి వుండవచ్చని యూఎస్ ఫెడరల్ అధికారులు అనుమానిస్తున్నారు. విడాకులు తీసుకున్నప్పటికీ, ఆమెకు మతీన్ తో సంబంధముందని, గే క్లబ్బులకు పలుమార్లు మతీన్ తో కలసి వెళ్లిందని అధికారులు గుర్తించారు. దాడికి వారం ముందు కూడా మతీన్ తో ఆమె కలిసి కనిపించిందని, ఇద్దరూ కలిసి తిరుగుతున్న సమయంలోనే మతీన్ ఆయుధాలను సమకూర్చుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. దీంతో ఏ క్షణమైనా నూర్ ను అదుపులోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. కాగా, మతీన్ కు ఎలాంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధం లేదని స్వీయ ఉగ్రవాద భావజాల ప్రేరేపణలతోనే ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని యూఎస్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. అయితే, దాడి వెనుక కుట్ర కోణం ఉందన్న అనుమానంతోనే నూర్ ను అరెస్ట్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News