: 18 సింహాలపై హత్యారోపణలు... గుజరాత్ లో కేసు, నేరం రుజువైతే జీవిత ఖైదు!


గుజరాత్ లోని గిర్ నేషనల్ పార్క్ లోని 18 మగ సింహాలు ఇప్పుడు పోలీసు కేసును, విచారణను ఎదుర్కొంటున్నాయి. వీటిల్లో ఒక సింహం మానవభక్షకిగా మారిపోయి, మనుషులను చంపడమే ఇందుకు కారణం. ఆ మ్యానీటర్ ను కనుగొనేందుకు పోలీసులు వాటి పాదముద్రలను, ముఖ కవళికలను ఇప్పటికే సేకరించారు. ఈ సింహాల్లో కనీసం ఒకటి, మానవులకు హాని కలిగించేలా మారిపోయిందని, దాన్ని గుర్తించి న్యాయస్థానం ముందు నిలుపుతామని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు నిందుతులని గుర్తించిన 18 సింహాలను ఎటూ కదలనీయకుండా బంధించారు. ఇక వీటిల్లో ముద్దాయిగా తేలిన సింహానికి జీవితాంతం బోనులో ఉండే శిక్ష పడుతుందని తెలిపారు. అయితే, సదరు మ్యానీటర్ సింహం ఏదన్నది కనుగొనేందుకు అధికారులు నానా తంటాలూ పడుతున్నారని తెలుస్తోంది. వాటికి అనేక రకాల పరీక్షలు పెడుతున్నారు. మానవులపై దాడికి అలవాటుపడ్డ సింహం, మనుషులను చూస్తే కోపాన్ని తెచ్చుకుంటుందని, దాడులు జరిగిన చోట్ల పాదముద్రలు కూడా ముద్దాయిని తేలుస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గిర్ జాతీయ వన్యప్రాణి సంరక్షణా వనంలో 270 సింహాలున్నాయి. ఆఫ్రికా మినహా, ఒకే ప్రాంతంలో ఇన్ని సింహాలు ఉన్నది ఇక్కడ మాత్రమే.

  • Loading...

More Telugu News