: కారెక్కనున్న గుత్తా, వివేక్ బ్రదర్స్!... నేడు అధికారికంగా టీఆర్ఎస్ లోకి ఎంట్రీ!
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చేయిచ్చిన టీ కాంగ్ నేతలు నేడు అధికారికంగా తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరిపోతున్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ జి.వివేక్, మాజీ మంత్రి జి.వినోద్ తో పాటు టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాస్కరరావు, రవీంద్ర నాయక్ నేడు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు హైదరాబాదులోని టీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాము కాంగ్రెస్ వీడుతున్నట్లు వీరంతా ప్రకటించిన సంగతి తెలిసిందే.