: వైసీపీ చేజారిన పలమనేరు ఎమ్మెల్యే!... బెజవాడ భేటీకి అమర్ నాథ్ రెడ్డి గైర్హాజరీతో నిర్ధారణ!


వైసీపీ టికెట్ పై విజయం సాధించి ఆ తర్వాత టీడీపీలో చేరేందుకు మరో ఎమ్మెల్యే దాదాపుగా సిద్ధమైపోయారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోని పలమనేరు నియోజకవర్గం నుంచి మొన్నటి ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై విజయం సాధించిన ఎన్. అమర్ నాథ్ రెడ్డి నిన్న బెజవాడలో జరిగిన ఆ పార్టీ కీలక సమావేశానికి హాజరుకాలేదు. అమర్ నాథ్ రెడ్డితో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు, పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరుకాకున్నా... అందుకు గల కారణాలను వారు అంతకుముందే పార్టీ అధినేతకు తెలియజేసినట్లు సమాచారం. అయితే అమర్ నాథ్ రెడ్డి తన గైర్హాజరీకి సంబంధించి పార్టీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. గడచిన ఎన్నికలకు ముందు టీడీపీలోనే ఉన్న అమర్ నాథ్ రెడ్డి... ఎన్నికల అనంతరం వైసీపీ విపక్షానికే పరిమితం కావడం, పలువురు ఎమ్మెల్యేలు టీడీపీ బాట పట్టడంతో సొంత గూటి వైపు పయనించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం, ఈ మేరకు ఇప్పటికే ఆయన టీడీపీ కీలక నేతలను కలిసినట్లు కూడా సమాచారం. నిన్న బెజవాడలో జరిగిన కీలక భేటీకి హాజరుకాకపోవడం, గైర్హాజరీకి కారణాలు తెలపకపోవడంతో అమర్ నాథ్ రెడ్డి వైసీపీ చేజారిపోయినట్లు దాదాపుగా నిర్ధారణ అయ్యింది. త్వరలోనే ఆయన టీడీపీలో చేరే అవకాశాలున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News