: జగన్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది: జ్యోతుల నెహ్రూ
వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుందని టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ హెచ్చరించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, అవినీతిపై జగన్ కు మాట్లాడే అర్హత లేదని అన్నారు. అవినీతి గురించి జగన్ ఎంత తక్కువ మాట్లాడితే ఆయనకు అంత మంచిదని ఆయన సూచించారు. ప్రభుత్వం ఏ పని చేసినా దానిని విమర్శించడం, అందులో లోపాలు వెతకడమే లక్ష్యంగా జగన్ సాగుతున్నారని, ఇది రాష్ట్రానికి మంచిది కాదని ఆయన అన్నారు. పార్టీని ఎలా బలపరుచుకోవాలి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎలా వ్యవహరించాలన్న దానిపై జగన్ కు క్లారిటీ లేదని ఆయన విమర్శించారు. ఆయన తీరు మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.