: అనిల్ అంబానీపై కేజ్రీవాల్ ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు!


అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) చైర్మన్ అనిల్ అంబానీపై ఢిల్లీ ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు తగ్గకుండా చూసేందుకు అధికారులకు అనిల్ కంపెనీ లంచాలిచ్చిందని ఆరోపిస్తోంది . ఢిల్లీకి విద్యుత్ సరఫరా చేసే అడాగ్ కు చెందిన బీఎస్ఈఎస్ పనితీరు అత్యంత దారుణంగా, వేధించేలా ఉందని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఎస్ఈఎస్ పనితీరుపై చర్చించేందుకు రావాలని అనిల్ అంబానీకి ఢిల్లీ ప్రభుత్వం లేఖ ద్వారా ఆదేశాలు జారీ చేసింది. కాగా, అధికారంలోకి వస్తే ఢిల్లీలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చిన కేజ్రీవాల్ ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని బీజేపీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనిల్ కు ఢిల్లీ ప్రభుత్వం లేఖ రాయడం గమనార్హం.

  • Loading...

More Telugu News