: మోదీకి 29 డిమాండ్ల చిట్టా ఇచ్చిన జయలలిత... గంట సేపు సమావేశం


ప్రధాని నరేంద్ర మోదీని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ రోజు కలిశారు. తాజా ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జయలలిత ప్రధాని నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రయోజనాలకు సంబంధించిన 29 డిమాండ్ల చిట్టాను విప్పారు. సుమారు గంట సేపు సమావేశం కాగా, కేంద్రం నిధులు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. కేబినెట్ లో చేరడంపైన, జీఎస్టీ బిల్లుకు ఆమోదం తదితర అంశాలపై మోదీ ఆమె మద్దతు కోరారు. కాగా, వీరిద్దరి భేటీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News