: కుప్పకూలిన సన్ రైజర్స్ టాపార్డర్
రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాపార్డర్ మూకుమ్మడిగా విఫలమైంది. దీంతో సన్ రైజర్స్ జట్టు కేవలం 19 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ధావన్ డకౌటయ్యాడు. సంగక్కర 4 పరుగులతో సరిపెట్టుకున్నాడు. 6 ఓవర్ల అనంతరం జట్టు స్కోరు 29/5 కాగా, ప్రస్తుతం క్రీజులో విహారి (4), సామి (8) ఉన్నారు.