: ఎమ్మెల్యే కావాలని ఉందా?... అయితే ఇలా చేయండి: జగన్ సూచన
ఎమ్మెల్యే కావాలంటే ఘనమైన వారసత్వం కావాల్సిన అవసరం లేదని, డబ్బులు ఉండాల్సిన అవసరం లేదని వైఎస్సార్సీపీ అధినేత జగన్ అన్నారు. రాజకీయ నాయకులు అయ్యేందుకు ఒక చక్కని అవకాశాన్ని తాను కల్పిస్తున్నానని ఆయన చెప్పారు. రోజుకి నాలుగు గంటల చొప్పున, 5 నెలల పాటు రోజుకొక పంచాయతీ చొప్పున ప్రచారం చేస్తే... విజయం మీ సొంతమవుతుందని ఆయన తెలిపారు. 5 నెలలు పూర్తయ్యే సరికి మీరు లీడర్లు అవుతారని ఆయన చెప్పారు. ప్రతి ఇంటికీ వెళ్తే.. మనతో ఉన్నదెవరు, మాటలు చెబుతున్నదెవరు, మన వెంట నడిచేదెవరు? అన్న క్లారీటీ వస్తుందని ఆయన చెప్పారు. ఆ సమయంలో బూత్ ఏజెంట్లు, గ్రామ పెద్దలు, ఇలా వివిధ స్థాయిల్లో ఎవరిని గెలిపించాలో ప్రజలకు ఓ క్లారిటీ వస్తుందని ఆయన చెప్పారు. ఇలా ఆ ఇళ్లకు వెళ్లినప్పుడు వైఎస్సార్సీపీ ఇచ్చే పాంప్లేట్ ను గడపగడపకు ఇచ్చి, అందులోని ప్రశ్నలకు సమాధానాలు రాయించడం ద్వారా ప్రజల స్పందన తెలుస్తుందని ఆయన తెలిపారు. జూలై 8న నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.