: మొదటి నుంచీ గుత్తా తీరే అంత...!: నిప్పులు చెరిగిన పాల్వాయి


పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్ధాయిలో మండిపడుతున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి నమ్మకద్రోహి అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి నిప్పులు చెరిగారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, గతంలో టీడీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీలో పదవులు అనుభవించిన గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ పార్టీ అధికారం కోల్పోగానే కాంగ్రెస్ లోకి వచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా, సర్వ సౌఖ్యాలు అనుభవించిన గుత్తా ఇప్పుడు టీఆర్ఎస్ లోకి వెళ్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒకరిద్దరు నేతలు పార్టీలు వీడినా కాంగ్రెస్ కు వచ్చిన నష్టమేమీ లేదని, కార్యకర్తలు మాత్రం పార్టీ వెంట ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కొందరు నేతలు కోవర్టులుగా పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేవలం పదవులు, అధికారం కోసమే గుత్తా పార్టీ మారారని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News