: రేపు మరోసారి ధర్నాకు దిగే యోచనలో తెలంగాణ ఉద్యోగ సంఘాలు
తెలంగాణ సచివాలయ ఉద్యోగ సంఘాలు రేపు మరోసారి ధర్నాకు దిగే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్‌లోని తెలంగాణ సెక్రటేరియట్ లో ఈరోజు సమావేశమైన ఉద్యోగ సంఘాలు ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగులను తెలంగాణకు కేటాయించడంపై చర్చించారు. వారిని తెలంగాణకు కేటాయించిన అంశంపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. తెలంగాణ సచివాలయం ఎదుట ఈ అంశాన్ని నిరసిస్తూ రేపు ఆందోళన నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నట్లు సమాచారం. ఉద్యోగ సంఘాల భేటీలో టీఎన్జీవో నేతలు దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డితో పాటు తెలంగాణ సచివాలయ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు.