: టీఆర్ఎస్లోకి తమ పార్టీ నేతల జంపింగ్పై ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి ఈరోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కొద్ది సేపటి క్రితం ఆయన తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనుంచి నేతలు అధికార పార్టీలోకి జంప్ అవుతుండడంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో తమ పార్టీ పరిస్థితులపై కాంగ్రెస్ అధిష్ఠానం చర్చిస్తోంది. తెలంగాణలో భవిష్యత్ కార్యాచరణపై ముందుకు వెళ్లే అంశాలపై ఉత్తమ్ కుమార్తో ఆ పార్టీ నేతలు చర్చిస్తున్నారు.