: కర్నూలులో రెండేళ్ల కుమారుడ్ని రూ.1.3 లక్షలకు అమ్మిన తండ్రి
కర్నూలు జిల్లా నంద్యాలలోని నూనెపల్లిలో కన్నకొడుకుని ఓ తండ్రి అమ్మేసిన ఘటన చోటుచేసుకుంది. తన కుమారుడ్ని రూ.1.3 లక్షలకు ఓ తండ్రి అమ్మేశాడు. బాలుడి వయసు రెండేళ్లుగా తెలుస్తోంది. తమ కుమారుడ్ని తన భర్త అమ్మేసిన విషయాన్ని తెలుసుకున్న మహిళ ఆందోళనకు గురై, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఈరోజు ఫిర్యాదు చేసింది. తమ కుమారుడ్ని ఎలాగైనా తనకు అప్పగించాలని పోలీసులని వేడుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాలుడ్ని విక్రయించిన ఘటనపై విచారణ జరుపుతున్నారు.