: ముద్రగడ భార్య, కోడలికి బలవంతంగా ఫ్లూయిడ్స్: వైద్యులు


తుని రైలు దహనం కేసులో అరెస్ట్ చేసిన కాపులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఆమరణ నిరాహారదీక్షకు దిగిన ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని, ఆయన వైద్యానికి అంగీకరించడం లేదని డాక్టర్లు తెలిపారు. ఈ ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు, ముద్రగడ భార్య, కోడలికి బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నట్టు తెలిపారు. ముద్రగడ బీపీ 130/90 ఉందని, వైద్య పరీక్షలకు ఆయన ససేమిరా అంటున్నారని వివరించారు. ఆయనకు అత్యవసర పరీక్షలు, వెంటనే చికిత్స మొదలు పెట్టాల్సి వుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News