: ‘ఉడ్తా పంజాబ్’పై కోర్టు తీర్పు మోదీ పాలనపై పెరిగిన అసహనానికి చెంపదెబ్బ: కేజ్రీవాల్


'ఉడ్తా పంజాబ్' సినిమాకు ఒకే ఒక్క కట్ తో 'ఏ' సర్టిఫికేట్ ను ఇస్తూ చిత్రం విడుదలకు బాంబే హైకోర్టు అనుమతించిన విష‌యం తెలిసిందే. దీనిపై ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ స్పందించారు. బాంబే హైకోర్టు తీర్పు దేశంలో మోదీ పాల‌న‌లో పెరిగిన అసహనానికి చెంప‌పెట్ట‌ని ఆయ‌న అన్నారు. బీజేపీ కార్యకర్తలు ఢిల్లీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోన్న నేపథ్యంలో మ‌రోసారి విరుచుకుప‌డ్డ కేజ్రీవాల్.. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పాల‌న‌కు బీజేపీ నేత‌లు అడ్డుతగులుతున్నారని అన్నారు. బీజేపీకి గ‌త ఎన్నిక‌ల్లో ఢిల్లీ నుంచి ఎదురైన ఓట‌మిని ఆ పార్టీనేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని ఆయ‌న‌ అన్నారు. కాంగ్రెస్ అధినేత్రిపై మోదీ విమ‌ర్శ‌లు చేస్తూ ‘ఓట‌మిని జీర్ణించుకోలేకే పార్ల‌మెంట్లో బీజేపీని అడ్డుకుంటున్నార‌’ని అన్నారని కేజ్రీవాల్ గుర్తు చేశారు. మరి, కాంగ్రెస్ చేసే ప‌నినే బీజేపీ నేతలు ఇప్పుడు ఢిల్లీలో చేస్తున్నారా...? అని అన్నారు. ఢిల్లీలో మీ ఓట‌మిని త‌ట్టుకోలేకే మాకు అడ్డుత‌గులుతున్నారా..? అని కేజ్రీవాల్ ప్ర‌శ్నించారు.

  • Loading...

More Telugu News