: విజయవాడలో వైసీపీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభం!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దఎత్తున ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి ఫిరాయించిన తరువాత తొలిసారిగా విజయవాడలో ఆ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అధినేత జగన్ తో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. వైకాపా నుంచి మరింత మంది టీడీపీలోకి చేరనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వలసలను నివారించి, పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు చేపట్టాలన్న విషయమై జగన్, తన పార్టీ నేతలతో చర్చిస్తున్నట్టు వైకాపా వర్గాలు వెల్లడించాయి. పార్టీ నేతలు, కార్యకర్తలకు ఈ సమావేశం వేదికపై పూర్తి స్థాయి స్వేచ్ఛను ఇచ్చి, వారు చెప్పేదంతా వినాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.