: ఇక 16 ఏళ్లకే డ్రైవింగ్ లైసెన్స్... రవాణా మంత్రులతో కూడిన కమిటీ సిఫార్సు


డ్రైవింగ్ లైసెన్సుల నిబంధనలను సవరించాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు రాష్ట్రాల రవాణా మంత్రులతో కూడిన కమిటీ అభిప్రాయపడింది. చిన్నారులు వాహనాలు నడుపుతుండటం, తమ విద్యావసరాల నిమిత్తం ఇంటర్, డిగ్రీ విద్యార్థులు ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్న నేపథ్యంలో, 16 సంవత్సరాలు దాటిన వారికి లైసెన్స్ లు మంజూరు చేసేలా సవరణలు చేయాలని మంత్రుల బృందం అభిప్రాయపడింది. వీరికి గేర్లు లేని స్కూటీ తరహా వాహనాలను నడిపేందుకు అనుమతి ఇవ్వచ్చని సిఫార్సు చేసింది. రోడ్డు రవాణా, భద్రత, సౌకర్యాల మెరుగు వంటి విషయాలపై ఈ బృందం తన నివేదికను కేంద్రానికి అందించగా, అందులో 16 ఏళ్లకే డ్రైవింగ్ లైసెన్స్ సిఫార్సు కూడా ఉంది. రాజస్థాన్ రవాణా మంత్రి యూనస్ ఖాన్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ 16 ఏళ్లు దాటిన వారికి 100 సీసీ కన్నా మించని వాహనాలను నడిపేందుకు అనుమతించవచ్చని పేర్కొంది. ఇంకా ఆర్టీసీని బలోపేతం చేసేందుకు పన్నులను మినహాయించాలని, డ్రైవర్లకు డ్రస్ కోడ్ తీసివేయాలని కూడా ఈ కమిటీ సిఫార్సు చేసింది. కాగా, ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ మంత్రి శిద్ధా రాఘవరావు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News