: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్!... 10 మంది మావోయిస్టుల హతం
మావోయిస్టుల స్వైర విహారంతో నిత్యం అలజడి రేగుతున్న ఛత్తీస్ గఢ్ లో నిన్న రాత్రి భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య గంటల తరబడి జరిగిన కాల్పుల్లో పది మంది మావోయిస్టులు హతమయ్యారు. నారాయణపూర్ జిల్లా పరిధిలోని కేలంబస్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారు. కూంబింగ్ కు వెళ్లిన భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులపై పైచేయి సాధించిన భద్రతా బలగాలు 10 మంది మావోయిస్టులను మట్టుబెట్టాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.