: ఏపీ సచివాలయంలోని తెలంగాణ ఉద్యోగుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో తెలంగాణకు చెందిన ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఏపీ సచివాలయ ఉద్యోగులు అమరావతి తరలిపోయేందుకు సిద్ధమవుతుండడంతో నాలుగో తరగతి ఉద్యోగుల్లో ఆందోళన తలెత్తింది. ఏపీ సచివాలయ ఉద్యోగుల తరలింపు నేడు ప్రారంభమైన నేపథ్యంలో స్వల్పకాలంలోనే ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులంతా తరలనున్నారన్న వార్తలతో వీరు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తమను తక్షణం తెలంగాణ సచివాలయంలోకి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.