: ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్...ద్వితీయ వార్షికోత్సవ సేల్


విమానయాన సంస్థల ఆఫర్ సేల్ కొనసాగుతోంది. ఎయిరిండియా, స్పైస్ జెట్, విస్తారా ఎయిర్ లైన్స్ ఇలా ప్రతి విమానయాన సంస్థ ఆఫర్లతో ప్రయాణికులకు గాలమేస్తున్నాయి. తాజాగా ఎయిర్‌ ఏషియా ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ‘బిగ్‌ సేల్‌’ ఆఫర్ ప్రకటించింది. అన్ని రుసుములతో కలిపి కేవలం 799 రూపాయలకే దేశీయ ప్రయాణం అందిస్తున్నామని ఎయిర్ ఏషియా తెలిపింది. అయితే 2017 జనవరి 4 నుంచి 2017 ఆగస్టు 21లోపు ప్రయాణించాలనుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని ఎయిర్ ఏషియా తెలిపింది. ఈ ఆఫర్ లో ఈ నెల 19 వరకు టికెట్ బుక్ చేసుకోవాలని తెలిపింది. ఈ ఆఫర్ లో గువాహటి-ఇంఫాల్‌ మధ్య కేవలం 799 రూపాయలతో ప్రయాణించవచ్చని తెలిపింది. బెంగళూరు-కొచ్చి మధ్య కేవలం 899 రూపాయలతో ప్రయాణించవచ్చని చెప్పింది. బెంగళూరు-పూనెల మధ్య కేవలం 1,099 రూపాయలకే ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు వెల్లడించింది. ఇక దిల్లీ-బెంగళూరు మధ్య కేవలం 2,699 రూపాయలతో వెళ్లవచ్చని చెప్పింది. విశాఖపట్నం-బెంగళూరు మధ్య 1,199 రూపాయలతో ప్రయాణం చేయవచ్చని ఎయిర్ ఏషియా ప్రకటించింది. ఇక విదేశీ యానాన్ని కూడా సరసమైన ధరకే అందిస్తున్నట్టు ఎయిర్ ఏషియా వెల్లడించింది. కొచ్చి-కౌలాలంపూర్‌ మధ్య 3,399 రూపాయలకే ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని ఎయిర్ ఏషియా తెలిపింది.

  • Loading...

More Telugu News