: స‌చిన్‌కు రాసిన లేఖ‌తో రూ.76 లక్షల గ్రాంటు అందుకున్న స్కూలు


త‌మ‌ స్కూలు దుస్థితి ప‌ట్ల ఎంత‌మంది అధికారుల‌కు విన్నవించుకున్నా ఫ‌లితం లేక‌పోయింది. స్కూలును బాగు చేయాలంటూ తాము చేసిన ప్ర‌య‌త్నాల‌న్నీ విఫల‌మ‌య్యాయి. చివ‌రికి ఆ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు కలసి రాజ్య‌స‌భ స‌భ్యుడు, టీమిండియా మాజీ క్రికెట‌ర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కి త‌మ స్కూలు దుస్థితిని వివ‌రిస్తూ ఓ లేఖ రాశారు. అంతే, త‌మ స్కూలుకి ఏకంగా రూ. 76 లక్షల గ్రాంటు వచ్చింది. ఇటీవ‌ల పశ్చిమబెంగాల్ పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలోని స్వర్ణమయి సస్మల్ శిక్షా నికేతన్ నుంచి తాను అందుకున్న ఓ లేఖ ప‌ట్ల స్పందించిన స‌చిన్ ఆ స్కూలుకి తన ఎంపీలాడ్‌ పథకం ద్వారా రూ. 76 లక్షల నిధుల‌ను ఇచ్చారు. దీని ప‌ట్ల స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. 50 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ స్కూల్లో ప్రస్తుతం 900 మంది విద్యార్థులు విద్యను కొనసాగిస్తున్నారు. స‌చిన్ స్పందించ‌డంతో త‌మ స్కూలు ఇక బాగుప‌డుతోంద‌ని విద్యార్థులు సంబ‌ర‌ప‌డిపోతున్నారు. తమ స్కూలు అభివృద్ధి కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని మ‌రిన్ని నిధులు అడ‌గాల‌ని స్కూలు ఉపాధ్యాయులు అనుకుంటున్నార‌ట‌.

  • Loading...

More Telugu News