: గుల్బర్గ్ సొసైటీ నరమేధం కేసు: శిక్షల ఖరారును మరోసారి వాయిదా వేసిన కోర్టు
గుజరాత్‌లో 2002లో చెలరేగిన గుల్బర్గ్ సొసైటీ అల్లర్ల కేసులో దోషులుగా తేలిన వారికి శిక్షల ఖరారు అంశాన్ని ఈరోజు వెల్లడించాల్సి ఉంది. అయితే శిక్షల ఖరారును ఈనెల 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఇప్పటికే శిక్షల ఖరారు తీర్పు రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నెల 2వ తేదీన గుల్బర్గ్ నరమేధం కేసులో కోర్టు తీర్పును వెలువరించింది. నిందితులుగా విచారణను ఎదుర్కొన్న 66 మందిలో 24 మందిని కోర్టు దోషులుగా పేర్కొంది. నిందితుల్లో ఐదుగురు విచారణ జరుగుతోన్న సమయంలో మరణించగా మరొకరు కనిపించకుండా పోయారు. 36 మందిని నిర్దోషులుగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దోషులుగా తేలిన 24మందికి కోర్టు ఈనెల 17న శిక్షలు విధించనుంది.